Listen to this article

జనం న్యూస్ 3మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదిన వేడుకలను ఆదివారం జైనూర్ లో కాంగ్రెస్ నాయకులు, ఆత్రం సక్కు యూత్ పోర్స్ అభిమానులు ఘనంగా జరుపు కున్నారు .కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో అదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జి ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా లోని కుమరంభీం ఫర్టిలైజర్ దుకాణం ముందు ఆత్రంసక్కు యూత్ పోర్స్ అభిమానులు కేక్ కట్ చేసి జన్మదినం పురస్కరించుకొని చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం మండలంలోని పోచంలొద్ది కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చదువుతున్న 150 మంది ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం, పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రి అందేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని లక్ష్య సాధనకై కృషి చేయాలని కోరారు. తల్లితండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి సమాజంలో ప్రయోజకులుగా ఎదుగాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా రాసి మంచి మార్కులు సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ముఖీధ్ మాజీ వైస్ ఎంపీపీ లు లక్ష్మణ్, షేక్ రషీద్, కో అప్షన్ సభ్యుడు ఫేరోజ్ ఖాన్, సీనియర్ నాయకులు మెస్రం అంబాజీ, మాజీ సర్పంచ్లు కనక ప్రతిభ , రాథోడ్ రాందాస్, కనక గంగారాం, కొట్నాక దౌలత్ రావు, ఆత్రందత్తు, పెందోర్ లచ్చు, పెందొర్ ప్రకాష్, పెందర్ లాలాషా, జన్నవార్ పవన్, సుద్దాల శ్రీను, మహేష్, ఆనంద్, హైదర్,మెస్రం శేకు, మెస్రం దౌలత్ రావు తదితరులు ఉన్నారు.