

పయనించే సూర్యుడు గాంధారి 04/03/25
మండల కేంద్రంలోని గౌరారం ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మార్చి 3 తేదీన జరుపుకుంటామని,ప్రతి 1,000 మంది నవజాత శిశువులలో ఐదుగురికి శాశ్వత వినికిడి లోపం ఉందని ప్రధానోపాధ్యాయులు రాములు తెలిపారు. జ్ఞానేంద్రియాలన్నింటిని శబ్ద రూపంలో సమాచారం చేరవేసేది చేవెనని ప్రత్యేక ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. అట్లాంటి చెవిని 50 డేసి బుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని విన్నట్లయితే మధ్య చెవిలోని భాగాలు దెబ్బతింటాయని అలాగే, హెయిర్ ఫోన్,నీ డీజే ఎక్కువగా వినవద్దని దివ్యాంగులకు సహాయం చేయడంలో మనం ముందుండాలని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాపురావు, నిరోషా మరియు సరిత విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.