Listen to this article

జనం న్యూస్. మార్చి 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రధాన రహదారి అంతా గుంతల మయంగా మారి అటు వాహనదారులు ఇటు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇష్టానుసారంగా గణపతి కంకర క్రషర్ యజమాన్యం భారీ కంకర లోడుతో ఉన్న టిప్పర్లను రాత్రింబగలు అతివేగంగా నడపడంతోనే హత్నూర గ్రామం నుండి మొదలుకొని ఐటిఐ కాలొనీ వరకు రహదారిపై పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రతిరోజు అటుగా వెళ్లే వాహనదారులు సైతం ప్రమాదవశాత్తు ప్రమాదాలకు గురై మంచాన బారిన పడుతున్నారని తమఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గణపతి కంకర క్రషర్ యజమాన్యం మైనింగ్ పనులను కొనసాగిస్తున్నారని తెలిపారు. చుట్టూ ఉన్న భూగర్భ జలాలు ధ్వంసమై వ్యవసాయ పొలాల్లో పంటలు పండక రైతన్నలు నష్టపోతున్నామని వాపోయారు. పలుమార్లు హత్నూర గ్రామ మాజీ సర్పంచులు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు యువకులతో కలిసి స్థానిక తాసిల్దార్ మైనింగ్ ఆర్ అండ్ బి అధికారులకు వినతి పత్రాలు అందజేసిన అధికారులు మాత్రం కంకర క్రషర్ యజమాన్యానికే అనుకూలంగా వ్యవహరించడంతో భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు ప్రజలల్లొ బలంగా వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న కంకర క్రషర్ యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని రహదారిని మరమ్మతులు చేయించాలని హత్నూర గ్రామస్తులు కోరారు.