

జనం న్యూస్ 03 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వక్ఫ్ బిల్లును ఉప సంహరించుకోవాలని మైనార్టీల కోర్కెను ప్రభుత్వానికి మీద్వారా తెలియజేయుట గురించి. ఆర్య మేము అఖల పక్ష కమిటి మరియు యస్ సి యస్ టి బిసి మైనార్టీల ఐక్య వేదిక జోగులాంబ గద్వాల జిల్లా, తరుపున తమరితో మనది చేయునది.దేశంలో రోజురోజుకు మత మైనార్టీల పై దాడులు సర్వ సాధారణమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వత్తాసుతోనే ఇటువంటి దాడులు జరుగు మన్నాయనే ఆరోపణ, వేదన వారిలో వుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ” వక్ఫ్ బిల్లు” తేవటం వల్ల తమ హక్కులను ప్రభుత్వం కాల రాస్తున్నదని, తమ తిండిపై. సాంప్రాదాయాలపై దాడి జరుగుతున్నాదని వక్ఫ్ ఆస్తులపై బోర్డుకు వున్న పరిమిత మైన అధికారాలను కూడ తీసి వేస్తున్నదని నిరసనగా వున్నారు. వారి హక్కులపై దాడి ఖండిస్తూ 1/3/ 2025 న నాడు గద్వాలలో “రాజ్యాంగ పరిరక్షణ” – వక్ఫ్ బిల్లు పై పౌర చర్చ సదస్సు” అనేక మంది మేదావులు, మతపెద్దల, పౌరసమాజం ఆధ్వర్యంలో జరిగింది. ఈ చర్చలో ” వక్ఫ్ బిల్లు ” సవరణను ప్రభుత్వం విరమిచు కోవాలని మీ ద్వారా విన్న విస్తున్నాము. అదేవిధంగా జిల్లా మత సామరస్యాన్ని కాపాడానికి మీ వంతుగా సభలు, సమావేశాలు నిర్వహించి ఆదర్శ వంత మైన జిల్లా గా ఈ జిల్లా రూపు దిద్దాలని పౌర సమాజం తరుపున తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.
నాగర్ దొడ్డి వెంకట రాములు, బి అర్ యస్ రాష్ట్ర నాయకులు, అడ్వకేట్ మధుసూదన్, మౌలానా మొహమ్మద్ అబ్బాస్, జమీయత్ – ఉలేమా – హింద్ ప్రెసిడెంట్,అతికూర్ రెహమాన్, మైనారిటీ సబ్ ప్లాన్, ఇస్సాక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, కురువ పుల్లయ్య, బి అర్ యస్ వి కోఆర్డినేటివ్, శంకర ప్రభాకర్ టి పి యప్ , ఇక్బాల్, పాలమూరు అధ్యయన వేదిక, వాల్మీకి, బహుజన రాజ్యసమితి, మౌలానా ఖదీర్, మహబూబ్ అలీ, ఆటో చాంద్, రహమతుల్లా, టవర్ మక్బుల్, ఇలియాస్, సాధాతుల్లా తదితరులు పాల్గొన్నారు.