జనం న్యూస్ నవంబర్ 14, (పరిగి నియోజకవర్గ ఇన్చార్జి) వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రాగాపూర్ గ్రామంలో శుక్రవారం , రాఘవాపూర్ గ్రామంలో ఎల్నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ చారి , క్లస్టర్ ఆఫీసర్ ప్రక్యాత్ కుమార్, మరియు పి ఎం ఓ విజయ్ కుమార్, పాల్గొని రైతులకు ఆయిల్ పామ్ సాగు ప్రాముఖ్యత, ఎల్నినో పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు అవకాశాలు మరియు పంట నిర్వహణ పద్ధతుల గురించి వివరించడం జరిగింది.
ఈ సమావేశంలో రైతులు ఆయిల్ పామ్ సాగుపై మంచి ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం పరిగి మండలంలో మొత్తం 135 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత మంది రైతులను ప్రోత్సహించి, మండలంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయడం జరుగుతుంది. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మంచి ఆదాయ అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం.అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగాపూర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.