ఆంజనేయ నగర్ కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను – బండి రమేష్
జనం న్యూస్ జులై 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ని ఆంజనేయ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ నివాసితులు ఈరోజు హిమదుర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల నిర్వహించిన బైలాస్ కమిటీ సమావేశంలో కాలనీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై బండి రమేష్ అందించిన అమూల్య మైన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా తమకు మార్గదర్శకత్వం వహిస్తూ, కాలనీ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, “నేను కేవలం ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఆంజనేయ నగర్ కాలనీ నివాసుడిగా కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను. కాలనీ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో మీతో కలిసి పనిచేస్తూ, మీకు నిరంతరం తోడుగా నిలుస్తాను” అని హామీ ఇచ్చారు.బండి రమేష్ హామీపై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, గంట సుబ్బారావు, రామానుజన్ రెడ్డి, ధర్మారావు, ప్రతాప్, హనుమాన్, శ్రీనివాస్, శ్యామ్, చక్రధర్, సుబ్బు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.