వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను కలిసిన జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ

July 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి *ఎస్సీలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వినతి*డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.*పార్టీ పదవుల్లో ఎస్సీలకు సముచిత స్థానం* ఈ భేటీలో ప్రధానంగా జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సామాజిక వర్గానికి చెందిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ కమిటీలలో మరియు వివిధ పదవుల్లో తగిన ప్రాధాన్యత, సముచిత స్థానం కల్పించాలని జిల్లా అధ్యక్షులను కోరారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం, క్షేత్రస్థాయి నుంచి ఎస్సీ వర్గాల రాజకీయ ఎదుగుదలకు మరింత అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.*ముమ్మిడివరం నియోజకవర్గ పరిస్థితులపై చర్చ* అదేవిధంగా, ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రజల నాడి మరియు క్యాడర్ సమన్వయంపై జిల్లా అధ్యక్షులకు సమగ్రంగా వివరించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యక్రమాలను వారి దృష్టికి తెచ్చారు.*సమిష్టి కృషితోనే పార్టీ బలోపేతం* నాయకులు వివరించిన అంశాలపై జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి సానుకూలంగా స్పందించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. క్యాడర్ లో నూతనోత్తేజం నింపుతూ, ప్రజా పక్షాన నిలబడి నిరంతరం శ్రమించాలని దిశా నిర్దేశం చేశారు

🌐 Select Language:
📰 ePaper