షైనింగ్ స్టార్స్ 2026 ప్రతిభా పురస్కారాలు

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివర ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :2025 26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2026 ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది.కాట్రేనికోన మండలం నుండి ఈ అవార్డుకు మొత్తం 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పి లక్ష్మీవాడ : ఎన్ కార్తీక, జి హర్షినీ సత్య దుర్గజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాట్రేనికోన : అంగాని పరమేశ్వరి, ఎస్ఎస్ఎస్ సాయి లావణ్య
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందికుప్ప : టి సత్య భవాని, చాముండేశ్వరిప్రధానోత్సవ కార్యక్రమం :ఈ పురస్కారాల ప్రధానోత్సవం 20 07 2026 సోమవారం ఉదయం 9 గంటలకు అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్ కలెక్టరేట్ వద్ద జరుగుతుంది.ఎంపికైన ప్రతి విద్యార్థికి 20 వేల రూపాయల నగదు బహుమతి మరియు పతకం అందజేయనున్నారు. విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు భోజన సదుపాయం ఉంటుంది. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాబితాలో ఉన్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి, నిర్ణీత సమయానికి కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.