రోడ్డు ప్రమాదంలో బాబాయ్ మృతి కుమారునికి తీవ్ర గాయాలు

జనం న్యూస్ 19 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు పరామర్శించిన గ్రామ సర్పంచ్ తూమ్ కృష్ణారెడ్డి మాజీ ఎంపిటిసి గోపాల్ రెడ్డి జోగు లాంబ గద్వాల జిల్లా శనివారం మల్దకల్ మండలం అమరవాయి గ్రామం ఎస్సీ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన దేవరాజు పద్మమ్మ ల మొదటి కుమారుడు హరికృష్ణ అలియాస్ (లడ్డు ) వయసు (22) సంవత్సరాలు.తన తమ్ముడి కుమారుడు ఏసేపు వయసు ( 20 )సంవత్సరాలు.ఇద్దరు కలిసి నిత్యం తమ స్వంత గ్రామం అమరవాయి నుండి వృత్తి పరంగా గద్వాల పట్టణానికి టైల్స్ పరచుటకై కూలీలుగా బ్రతుకు జీవనం గడుపుతున్నారు.శనివారం వారికి పని లేకపోవడంతో గద్వాల నుండి అమరవాయికి మధ్యాహ్నం అందాజ 2: 30 గంటల నిమిషాల వ్యవధిలో తిరుగు ప్రయాణంలో బైకుపై వస్తుండగా పరుమాల నుండి కుర్వపల్లి స్టేజి మధ్యలో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ అలియాస్ (లడ్డు) మొహానికి బలమైన గాయాలు కాగా ఆకస్మాత్తుగా అక్కడిక్కడే మృతి చెందాడు.అదేవిధంగా తన అన్న కుమారుడు ఏసేపు కు తలకు కాళ్లు చేతులకు బలమైన గాయాలు కాగా గమనించిన స్థానికులు ఇద్దరినీ వైద్య చికిత్స నిమిత్తమై 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.హరికృష్ణ చికిత్స నిమిత్తమై వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఏసేపు రక్త పరీక్ష నమూనాలను పరిశీలించి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తమై కర్నూల్ జిల్లాకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు.అనంతరం కుటుంబ సభ్యులు ఏసేపును కర్నూలు జిల్లాకు 108 అంబులెన్స్ లో తరలించారు. అంతకంటే ముందుగా విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తూమ్ కృష్ణారెడ్డి,మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతి చెందిన హరికృష్ణ కుటుంబాన్ని,తీవ్రంగా గాయపడిన ఏసేపు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఎమ్మెల్యే బండ్ల.కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం అందేందుకు మా వంతుగా కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.హరికృష్ణకు సంవత్సరం క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం.ప్రస్తుతం ఆమె నిండు గర్భిణీ కావడంతో కుటుంబానికి దిక్కేవరంటూ కన్నీటి రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.ఈ సంఘటనతో అమరవాయి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకున్నాయి.రెక్కాడితేకానీ డొక్కారని పేద కుటుంబాలలో ఈ విధంగా జరగడం దురదృష్టకరమని భావించారు.