భవన నిర్మాణ కార్మికులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది జాయినింగ్ కమిటీ సభ్యులు: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్*

July 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం లోని ఏ.వి.బి పురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు వారిచే నిర్వహించిన (లేబర్ కార్డ్ మరియు ఇష్రమ్ భీమా కార్డ్ ) నమోదు కార్యక్రమాన్నికి జనసేన పార్టీ జాయినింగ్ కమిటీ సభ్యులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కంటెస్ట్ ఎం.ఎల్.ఏ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి జనసేన పార్టీ మరియు అధినేత పవన్ కళ్యాణ్ ఉంటారని, ఈ కేంద్ర ప్రభుత్వ భీమా పథకం వలన మీ కుటుంబానికి రక్షణ లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్,వేముల మహేష్, రణదీప్,సింహాద్రి , ప్రసాద్,గోవింద్,శివశంకర్ ,దుర్యోధన,రాజు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper