నంద్యాల శ్రీరామచంద్రమూర్తికివికాస్ మెడికల్ అకాడమీలో4 వ స్థానం లో ఘన విజయం
జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంచెయ్యేరుకు చెందిన నంద్యాల శ్రీరామచంద్రమూర్తి నీట్ పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.వికాస్ మెడికల్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీరామచంద్రమూర్తి 561 మార్కులు సాధించినారుఆయన నరసింహస్వామి కుమారుడు. కష్టపడి చదివి ఈ ఘన విజయం సాధించిన శ్రీరామచంద్రమూర్తిని గ్రామస్తులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు అభినందిస్తున్నారు.విద్యార్థి ఈ విజయం వెనుక వికాస్ మెడికల్ అకాడమీ ఫ్యాకల్టీ కృషి ఎంతో ఉందని తల్లిదండ్రులు తెలిపారు.