నోటి దురుసు నికృష్ట రాజకీయ సంస్కృతి రేవంత్ రెడ్డి గ్యాంగ్ దిగజారుడు తనానికి ఇదే నిదర్శనం”

July 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 19 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :సంపత్ కుమార్ బెదిరింపుల రాజకీయాలు మానండి, వాస్తవాలతో మాట్లాడండి మీడియా సమావేశంలోనే బూతులు మాట్లాడే మీ పత్తిత్తు వ్యవహారం అలంపూర్ ప్రజలందరికీ ఎరుకే సంపత్ మాజీ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగిపు ఏ అర్హత లేని రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వ గన్మెన్ లు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కాన్వాయ్ ఎందుకు అయిజ పట్టణంలో బి ఆర్ యస్ పార్టీ జోగులాంబ గద్వాల సోషల్ మీడియా టీం నిర్వహించిన సమావేశంలో తుప్పత్రాల వీరేష్ మాట్లాడుతూఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశం ప్రజా సమస్యలపై చర్చించడానికి కాకుండా వ్యక్తిగత విమర్శలు, హెచ్చరికలు, రాజకీయ విద్వేషాన్ని ప్రోత్సహించే వేదికగా మారడం విచారకరం అని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ లేవనెత్తిన అంశం వ్యక్తిగతం కాదు. ఒకే అంశంపై వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు ప్రమాణాలు ఎందుకు అమలవుతున్నాయనే ప్రశ్న మాత్రమే. ఒకరిపై చట్టం ఒకలా, మరొకరిపై మరోలా అమలవుతుందా అనే సందేహాన్ని ప్రజల తరఫున ఆయన వ్యక్తం చేశారు. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు, బెదిరింపులతో స్పందించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రశ్నించే గొంతులను నొక్కడం ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వ పోకడ. రేవంత్ సర్కార్.. భయంతో బెదిరించి అధికారంలో కొనసాగాలనుకోవడం మీ పిరికితనానికి నిదర్శనం చట్టం మీ చుట్టమా? డబుల్ స్టాండర్డ్స్
బీజేపీ ప్రభుత్వం మీనాక్షి నటరాజన్ రెండు ఓట్లు ఉంటే సీట్లు నిరాకరిస్తుంది.ప్రకాష్ రాజ్ పై దేశద్రోహం కేసులు వేస్తుంది.
మరి, రెండు ఓట్లు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్టు చేయరు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అడిగిన ఈ ప్రశ్నకు మీ వద్ద సమాధానం లేదు కాబట్టే పద్ధతి లేని విమర్శలకు దిగుతున్నారు.ఓటరు జాబితాలో పేరు బదిలీ చేసుకోవడం భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ. దీనిపై చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల ముందుకు తీసుకెళ్లాలి. కానీ రాజకీయ వేదికలపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైన పద్ధతి కాదు మాజీ ఐ పి యస్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ భద్రతపై జాతికి సేవ పై సంపత్ కుమార్ గారి వ్యాఖ్యలు సంబోధనకు నోచుకోనివి ఒక ఐ పి యస్ ఆఫీసర్ గా చట్టం నిర్దేశించిన విధుల్లో భాగంగా దాదాపు 26 సంవత్సరలు సేవచేసిన వారికి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రవీణ్ కి “థ్రెట్ ఉందని చెప్పిన ఉదేశ పూర్వకంగా భద్రత తొలగించి ఎలాంటి అర్హత పదవులు లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వ గన్ మెన్ లు, కాన్వాయి దేనికి, మంత్రులకు కూడా లేనటువంటి భద్రత రేవంత్ రెడ్డి సోదరులకు కల్పిస్తున్నారు, ఏం అర్హత ఉందో చెప్పు దీనికి ఏం సమాధానం చెప్తారు , కళ్ళు కనబడటం లేదా సంత్ కుమార్ గురుకులాల్లో ప్రవీణ్ సార్ వల్లే విప్లవాత్మక మార్పులురేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యం – దోపిడీ అపారంఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎనిమిది సంవత్సరాల పాటు గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా పనిచేసిన కాలంలో గురుకుల విద్య విస్తరణ మౌలిక సదుపాయాల మెరుగుదల విద్యార్థుల నమోదు పెరుగుదల నాణ్యమైన విద్య అందించడం పై అనేక సంస్కరణలు జరిగాయని విస్తృతంగా ప్రశంసలు పొందాయి. అదే పనితీరును పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన చేసిన సేవలను తక్కువ చేయదు. ఇసుక మట్టి, భూకబ్జాలు.. రేవంత్ రెడ్డి అండదండలతో మీ నాయకులు చేస్తున్న దందాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. విద్యార్థుల సమస్యలు పట్టవు, నిరుద్యోగుల గోస పట్టదు మీకు కావాల్సిందల్లా కేసీఆర్ ని తిట్టడం బి ఆర్ ఎస్ పార్టీ నేతల్ని బెదిరించడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యకు అపూర్వ ప్రాధాన్యం లభించింది. కొత్త గురుకులాల ఏర్పాటు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశాల విస్తరణ, విద్యా నాణ్యత పెంపు వంటి చర్యలు వేలాది కుటుంబాలకు ఉపయోగపడ్డాయి. ఈ వాస్తవాలను ప్రజలు మరచిపోలేదు.ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, నిరుద్యోగ సమస్య, రైతుల ఇబ్బందులు, విద్యార్థుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాధానాలు ఇవ్వాల్సిన సమయంలో ప్రతిరోజూ బీఆర్ఎస్, కేసీఆర్, ప్రతిపక్ష నాయకులపై విమర్శలతోనే కాలం గడపడం పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపిస్తోందిమర్యాద మరచిన భాషఒక మాజీ ప్రజా ప్రతినిధిగా ఉండి పల్లెటూరిలో కూడా ఎవరూ మాట్లాడని రీతిలో సంస్కారహీనంగా, ఒక ఐపీఎస్ అధికారిని, ప్రజా నాయకుడిని పత్తితి కాళ్లు పట్టుకునే స్థాయి మోకరిల్లే గుణం” అని వ్యాఖ్యానించడం మీ విజ్ఞతకు నిదర్శనం! మీ స్థాయి ఎంత మీరు వాడిన పదజాలం ఎంత నీచమైనది? మీ మాటలే మీ అహంకారాన్ని, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోని సంస్కారహీనతను బయటపెట్టాయి.సంపత్ కుమార్ ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం మీ హక్కే. కానీ “జాగ్రత్తగా తిరుగు” అనే తరహా హెచ్చరికలు చేయడం రాజకీయ సంస్కృతికి తగదు. ప్రజలు ఇలాంటి భాషను సమర్థించరు అలంపూర్ ప్రజలు వ్యక్తిగత విద్వేషాలు కాదు అభివృద్ధి కోరుకుంటున్నారు. బెదిరింపులు కాదు బాధ్యతాయుతమైన రాజకీయాలు కోరుకుంటున్నారు. వాస్తవాలను వక్రీకరించి వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం మానుకుని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకత్వానికి సూచిస్తున్నాము.ప్రజాస్వామ్యంలో చివరి తీర్పు ప్రజలదే. వాస్తవాలు నిలుస్తాయి వ్యక్తిగత దూషణలు కాదు.ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ సోషల్ మీడియా జిల్లా టీం తుప్పత్రాల వీరేష్ వాబనగిరి రవి ముగోనిపల్లి అంజి బాబు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper