కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) చిత్రపటానికి, సమాధికి పుష్పాంజలి ఘటించి నివాళికిర్లంపూడి, 18-07-2026 :ఈ నెల 14వ తేదీన స్వర్గస్థులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రముఖ కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం స్వగృహం కిర్లంపూడి గ్రామానికి పలువురు ప్రజాప్రతినిధులు విచ్చేశారు.వారు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి, సమాధికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాకినాడ సిటీ శాసనసభ సభ్యులు వనమాడి కొండబాబు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, పిఠాపురం మాజీ శాసన సభ్యులు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొన్నారు.ముద్రగడ పద్మనాభం సేవలు, సామాజిక ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.