రైతులందరూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి
జనం న్యూస్ జూలై 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడు మండలంరైతు వేదిక నందు ఎల్ – నినో వలన ఏర్పడే వర్షాభావ పరిస్థితులపైన మండల స్పెషల్ ఆఫీసర్ నిత్యానంద్ సార్ అధ్యక్షతన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలొ మండల వ్యవసాయ అధికారి డి వి రాజశేఖర్ సార్ మరియు కె.వి.కె సైంటిస్ట్ రవి సార్ మాట్లాడుతూ ఎల్ – నినో వలన ఏర్పడే వర్షాభావ పరిస్థితుల వలన వర్షపాతం తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని ఫలితంగా భూగర్భ జల మట్టం తగ్గే అవకాశం ఉంది. అధిక నీరు అవసరం ఉన్న వరి పంట ( నీటి అవసరం :1100- 1250 మిల్లీ మీటర్ ) కి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అయిన అపరాలు, చిరు ధాన్యలు, వేరుశనగ జొన్న మరియు కూరగాయలు ( నీటి అవసరం : 200-350 మిల్లీ మీటర్ ) మొదలగు పంటలు సాగు చేసుకోవాలని సూచించారు, ఒక ఎకరం వరి పండించే నీటితో మూడు ఎకరాల ఆరుతడి పంటలు సాగించవచ్చు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివ ప్రసాద్ ఎంపీడీవో ప్రశాంత్ పి ఎ సి ఎస్చైర్మన్ ధర్మ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు శ్రీహరి ఏఈఓ కృష్ణవేణి మరియు వివిధ గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.ఇట్లు
వ్యవసాయ శాఖ