ప్రజాసేవలో నిబద్ధతకు నిదర్శనం ‘సేవారత్న’ అవార్డు: ఒంటిమిట్ట సి.ఐ పి.వెంకటేశ్వర్లుకు

July 18, 2026 | తెలంగాణ

జనం నందలూరు కడప జిల్లా ​హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లును ‘సేవారత్న’ జాతీయ అవార్డుతో సత్కరించారు. సంస్థ జాతీయ అధ్యక్షులు తాళ్లూరి ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు, కడప జిల్లా చైర్మన్ డాక్టర్ వి. డేవిడ్ సేవారత్న ఈ పురస్కారాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా డాక్టర్ డేవిడ్ మాట్లాడుతూ, పి. వెంకటేశ్వర్లు గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు, ప్రభుత్వానికి అత్యంత విలువైన సేవలందించారని కొనియాడారు. ఆయన పనితీరును గుర్తించి, ప్రశంసా పత్రం మరియు మెమెంటోను అందజేయడం జరిగిందని తెలిపారు.​అవార్డు ను స్వీకరించిన సి.ఐ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించ డం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత బాధ్యతా యుతంగా సేవలందిస్తానని ఉద్ఘాటించారు.​ఈ కార్యక్రమంలో నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, రాయలసీమ డ్రగ్స్ అండ్ క్రైమ్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి, కడప జిల్లా ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ గురివిగారి వాసు దేవకుమార్, పఠాన్ మెహర్ ఖాన్, టి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper