పరిగిలో బీఆరెస్ నాయకులను అరెస్ట్.

July 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 18 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి పట్టణంలో పలు కార్యక్రమాల శంకుస్థాపనకై పరిగి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని అడ్డుకుంటారని నెపంతో అక్రమంగా బీఆరెస్ నాయకులను అరెస్టు చేసిన పరిగి పోలీసులుఅరెస్టు చేసిన వారిలో పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్ జాక్ రవికుమార్, ఆనేం ఆంజనేయులు, ఇక్బాల్, బలాల, కుమార్, నరేశ్, హరి , తదితరులు ఉన్నారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అవసరం లేని సందర్భాలలో నాయకులను ముందస్తు అరెస్టు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మేము అడ్డుకోవాలంటే బీఆరెస్ కార్యకర్తలను ఆపగలరా, అని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. ప్రజలే మిమ్మల్ని అడ్డుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేశారు, బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు

🌐 Select Language:
📰 ePaper