నందికొండ మున్సిపాలిటీలో ఘనంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ -జూలై 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ పిల్లర్ వద్ద మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి, ఈ సందర్భంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ 1వ వార్డు ఇంచార్జ్ పమ్మి జనార్దన్ రెడ్డి, 2వ వార్డు ఇన్చార్జి మహమ్మద్ గని, 4వ వార్డు ఇన్చార్జి విజయ్, 6 వ వార్డు ఇంచార్జ్ సభావత్ చంద్రమౌళి నాయక్,7వ వార్డు ఇన్చార్జి సయ్యద్ మక్సూద్, 9వ వార్డు ఇంచార్జ్ బత్తుల శేఖర్, 10వ వార్డు ఇంచార్జ్ కోడా విజయ్,11వ వార్డ్ ఇంచార్జ్ హీరేకర్ రమేష్ జి, లక్ష్మణ్ నాయక్, కోట్ల సైదులు, జిలాని,ధారా రవి, రఫీ భాష, నసీర్, షరీఫ్, మన్సూర్, కేశవ్, సునీల్, బంటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.