రథ యాత్రలో గాయపడ్డ జగతి గోవిందను రామర్శించిన నాగ జగదీష్

July 18, 2026 | తెలంగాణ

రథ యాత్రలో గాయపడ్డ జగతి గోవిందను రామర్శించిన నాగ జగదీష్

జనం న్యూస్ జూలై 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణజగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా గౌరీ గంధాలయ వీధిలో రథం ఆపే సమయంలో ప్రతి సంవత్సరం రథయాత్రలో రథం ఆపే పనిని తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిలపరిశెట్టి జగతి గోవింద వీధుల్లో రథం ప్రయాణించేటప్పుడు రాయి వేసి ఆపే పనిని జగతి గోవింద చూసేవాడిని, అదేవిధంగా ఈ నెల 17వ తేదీన రధాన్ని ఆపే ప్రయత్నంలో చక్రాలు కాలు పై నుండి వెళ్లడంతో ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారని ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు గోవిందను హాస్పటల్లో పరామర్శించారు. జగతి గోవిందుతో మాట్లాడి ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకుని డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించి జాగ్రత్తగా చూసుకోవాలని హాస్పటల్ సిబ్బందికి నాగ జగదీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ బోడి వెంకటరావు కుప్పిలి జగన్ మల్లా శివన్నారాయణ విల్లూరి రమణబాబు రేబాక ఈశ్వర అప్పారావు కొమోజు రామకృష్ణ దాడి వెంకటరావు తదితరులు జగద్ గోవిందను పరామర్శించారు

🌐 Select Language:
📰 ePaper