ఇన్చార్జి వార్డెన్ లతో ఇబ్బందులు పడుతున్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు- కె వి పి ఎస్

July 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్-జులై 18- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఉన్న ఎస్సీ హాస్టల్లోని సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించరు, ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున మాట్లాడుతూ ఇన్చార్జి వార్డెన్లను నియమించడం వలన హాస్టల్లో ఉండే విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతూ క్రమశిక్షణ లేకుండా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు తక్షణమే ఇన్చార్జి వార్డెన్ లని కాకుండా రెగ్యులర్ వార్డులను నియమించాలని డిమాండ్ చేశారు హాస్టల్లో మరుగుదొడ్లు లేక బహిర్భూమికి అడవుల్లోకి పోతున్నారని విద్యార్థులకు ఏదైనా అయితే పట్టించుకునే నాధుడే లేరని అన్నారు అదేవిధంగా బాత్రూంలు లేవని వెంటనే బాత్రూంలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం వంట చేసి పెట్టడం లేదని అన్నారు హాస్టల్ భవనం వర్షం పడితే రూములు మొత్తం కారుతున్నాయని వాటికి వెంటనే మరమ్మత్తులు చేసి ఈ వర్షాకాలంలో పిల్లల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రాత్రిపూట కరెంటు పోతే పిల్లలు చదువుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని వెంటనే ఇన్వర్టర్ ని ఏర్పాటు చేసి కరెంటు సమస్యను పరిష్కరించాలని అన్నారు, పిల్లలకి నోటు పుస్తకాలు ఇంకా ఇవ్వలేదని ప్లేట్లు గ్లాసులు ఇవ్వలేదని వెంటనే పిల్లలకు కావలసిన వస్తువులు ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు ,లేని ఎడల కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సర్వే కార్యక్రమంలో కెవిపిఎస్ నాగార్జునసాగర్ పట్టణ కార్యదర్శి చుక్క రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper