జి.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ కు నగదు అందజేసిన యాజమాన్యం
జనం న్యూస్ జూలై 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన చౌటకూరి గోవర్ధన్ రెడ్డి సామాజిక కార్యక్రమాల్లో అలాగే 2025 26 10వ తరగతి లో పదవ తరగతి ర్యాంక్స్ పొందిన విద్యార్థులకు ట్రస్ట్ అధ్యక్షులు చౌటకూరి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నగదు బహుమతులను జోగిపేట ఉన్నత పాఠశాలలో పిఆర్టియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మానేయ ఎంఈఓ బండి కృష్ణ చేతులమీదుగా విద్యార్థులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు చౌటకూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సహాయం చేయడం నాకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు రాంబాబు వెంకటేష్ ప్రతాపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శంకర్ నరసింహులు ధర్మేందర్ రవీందర్ రెడ్డి కొత్త శ్రీనివాస్ బీ శ్రీనివాస్ శ్రీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారుసేవే మార్గం ప్రేమే లక్ష్యం అనే నినాదంతో ముందుకు సాగుతానని కొనియాడారు