రేపు కోరుట్లలో “పాంచజన్య సంకల్ప సభ” – భారీగా తరలిరావాలని డాక్టర్ రఘు పిలుపు

July 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జులై 18, జగిత్యాల జిల్లా, కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరి గార్డెన్స్ వేదికగా రేపు (జూలై 19) మధ్యాహ్నం 2 గంటల నుంచి “పాంచజన్య సంకల్ప సభ” నిర్వహించనున్నట్లు ప్రముఖ ప్రజా వైద్యుడు డాక్టర్ రఘు తెలిపారు. ప్రజల ఆశయాలు, తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయ పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ సంకల్ప సభ జరగనుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ప్రజా వైద్యుడిగా, కుటుంబ సభ్యుడిలా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని, ఇకపై ప్రజల సమస్యల పరిష్కారం, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం సాధన కోసం మరింత విస్తృత స్థాయిలో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.ఈ నూతన ప్రజా ప్రయాణంలో ప్రజల ఆశీర్వాదం, ఆదరణ, భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, కోరుట్ల నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, యువత, మహిళలు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై “పాంచజన్య సంకల్ప సభ” ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper