విద్యపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఎక్కడా?మల్చెల్మ ఉన్నత పాఠశాలకు కొత్త భవనం నిర్మించాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం డిమాండ్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జులై 18. 07. 2026 జహీరాబాద్ మండలం మల్చెల్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు ఆకస్మికంగా సందర్శించగా పాఠశాల భవనం పూర్తిగా దెబ్బతిని కూలిపోయే దశకు చేరుకోవడంతో ఉర్డు మీడియం ప్రాథమిక పాఠశాల భవనంలోకి మార్చి షిప్టుల పద్దతిలో నడిపిస్తున్నట్లు తెలిసింది,ఉదయం 8 నుండి మధ్యాహ్నం12.30 వరకు ప్రాథమిక పాఠశాల,మధ్యహ్నం 12.నుండి 4.30వరకు ఉన్నత పాటశాల నడిపిస్తున్నట్లు తెలిసింది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండున్నర సంవత్సరాలు అయినా కూడా ఉన్నత పాఠశాలకు కొత్త భవనం నిర్మించక పోవడం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేయడమే,ప్రాథమిక పాఠశాల 1నుండి 5 తరగతులకు 85 మంది విద్యార్థులు ఉండగా అక్కడ 5 గురు టీచర్లు ఉండాలి కానీ ఇద్దరు టీచర్లు మాత్రమే కలరు తల్లిదండ్రులను విచారించగా టీచర్ల కొరత వల్ల విద్యార్థులు సక్రమంగా చదవలేక పోతున్నారని తెలిపారు,గ్రామాలలో వ్యవసాయ పనులకు,కూలి పనులకు తల్లిదండ్రులు ప్రొద్దున్నే వెళ్లిపోతుంటారు 1నుండి5 వరకు చదివే పిల్లలు 12.30 కె ఇంటికి వెళ్లి ఏమి చేయాలి,6నుండి 10 వరకు చదివే విద్యార్థులు విద్యాబోధన సమయం సరిపోక నష్టపోతున్నారు ఈ అయోమయ పరిస్థితుల వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది.ప్రక్కనే ఉన్న వసతి గృహం అది కేవలం కట్టిన 15 సంవత్సరాలకె భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది దింతో అక్కడి నుండి వసతి గృహాన్ని ఎత్తివేయడం జరిగింది ఆభవనం కట్టించిన అధికారులపైన,కట్టిన కాంట్రాక్టర్ పైన గాని ఏమి చర్యలు తీసుకోకుండా హాస్టల్ ను మూసివేయడం దారుణం,హాస్టల్ ను మూసివేయడం వల్ల విద్యార్థుల సంఖ్య 250 నుండి132కు తగ్గిపోయింది,ప్రభుత్వానికి విద్య పైన ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతున్నది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాథమిక ఉన్నత పాటశాలకు కొత్త భవనాన్ని మంజూరు చేయాలని, పాఠశాలలో ఉన్న టీచర్ల ఖాళీలను భర్తీచేయాలని డిమాండ్,మరియు హాస్టల్ కట్టిన,కట్టించిన,అధికారులు/కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుని హాస్టల్ ను పునరః ప్రారంభించాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మోహినో ద్దీన్, యస్,గోపాల్, ఆనంద్,యం.డి.సాదిక్,యం.మల్లేశం,మాణిక్ రెడ్డి, ఘోరేప్ప,నసిర్,లాల్ మొహ్మద్,పవన్ రాథోడ్,మేఘనాథ్,గోపాల్,ఇతరులు ఉన్నారు