మహిళలకు వెంటనే 50% రిజర్వేషన్ అమలు చేయాలి

July 18, 2026 | వైరల్ వార్తలు

ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పరకాల

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటూ, ఆచరణలో మాత్రం మహిళలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తోందని పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ విమర్శించారు.దేశ జనాభాలో మహిళలు దాదాపు సగం ఉన్నప్పటికీ, వారికి రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపడం లేదన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల్లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా వెంటనే చట్టం తీసుకురావాలని అయన డిమాండ్ చేశారు.మహిళా రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంట్ స్థానాల పునర్విభజన (Delimitation)తో ముడిపెట్టడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని అయన ఆరోపించారు. మహిళలకు నిజంగా న్యాయం చేయాలనే సంకల్పం ఉంటే, స్థానాల సంఖ్య పెరిగే వరకు వేచి ఉండకుండా ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.మహిళా సాధికారత పేరుతో ప్రచారం చేయడం ఒకవైపు, అమలును నిరవధికంగా వాయిదా వేయడం మరోవైపు జరుగుతోందని అయన విమర్శించారు. మహిళల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని పేర్కొన్నారు.మహిళలకు సమాన హక్కులు, సమాన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ అమలు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని మల్లేశం గౌడ్ డిమాండ్ చేశారు.

🌐 Select Language:
📰 ePaper