జోగులాంబ గద్వాల్ జిల్లా డి డబ్బులు ఓ తో ఉదయ్ టీం భేటీ
జనం న్యూస్ 18 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; మన ఉదయ్ టీం అసోసియేషన్స్ దివ్యంగుల సమస్యల పరిష్కారం కొరకు జోగులాంబ గద్వాల్ జిల్లా ఉదయ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండయ్య మరియు జనరల్ సెక్రెటరీ హనుమంతు, జిల్లా సంక్షేమ అధికారి (డి డబ్ల్యు ఓ) సునంద ని మర్యాదపూర్వకంగా కలిసి, దివ్యాంగుల ప్రధాన సమస్యలపై వినతిపత్రం సమర్పించడం జరిగింది. చర్చించిన అంశాలు బి డబ్ల్యు ఓ సానుకూల స్పందన: బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు: వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరగా.. ఇప్పటికే కొన్ని శాఖల నుండి ఖాళీ లు వచ్చాయని, మిగిలిన శాఖల నుండి కూడా త్వరలోనే తెప్పించి ప్రక్రియ పూర్తి చేస్తామని డీ డబ్ల్యు ఓ తెలిపారు. డిస్ట్రిక్ట్ ఆర్పిడబ్ల్యుడి కమిటీ: జిల్లా స్థాయి ఆర్పిడబ్ల్యుడి యాక్ట్ కమిటీ ఏర్పాటుపై కలెక్టర్ కి వివరించి తగిన అప్‌డేట్ ఇస్తానని హామీ ఇచ్చారు.సెక్షన్ 92 బోర్డులు: దివ్యాంగుల రక్షణకు సంబంధించిన ‘సెక్షన్ 92’ ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటుపై జిల్లా ఎస్పీ కి అధికారికంగా లెటర్ పంపుతామని స్పష్టం చేశారు. దివ్యాంగుల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న మన జిల్లా సంక్షేమ అధికారీ సునంద కి మరియు ఉదయ్ జిల్లా టీం సభ్యులకు, రాష్ట్ర కమిటీ తరుపున ప్రత్యేక అభినందనలు ఉదయ్ టీం అసోసియేషన్స్