ఆంధ్రప్రదేశ్

బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు జగన్ కుట్రలు – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ ద్ద నాగ జగదీష్

బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు జగన్ కుట్రలు – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ ద్ద నాగ జగదీష్

జనం న్యూస్ అక్టోబర్ 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో 75 శాతానికి పైబడి బీసీ కులాలు ఉన్నాయని, వారికి రాజకీయం ప్రయోజనాలు కలిగించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి రాజకీయం భాగస్వామ్యం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంటే జగన్ రెడ్డి కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల బీసీల హక్కులను కాలరాస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. నాడు వైసిపి అధికారంలోకి రాకముందు 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి 16 వేల 800 వందల మందికి రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరం చేసిన ఘనుడు జగన్ రెడ్డి. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన వైసిపి సుప్రీంకోర్టు కి ఎందుకు వెళ్లలేదని, ఇంప్లిట్ చేసే అవకాశం ఉన్నా కూడా జగన్ రెడ్డి ముందుకు అడుగు వేయలేదని, దీన్నిబట్టి బీసీలు అంటే తీవ్రమైన వ్యతిరేకం భావం జగన్ రెడ్డి లో ఉందని చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతారని నాగ జగదీష్ మండిపడ్డారు. గత వైసిపి పాలనలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 75,740 కోట్లు బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి బీసీలకు కలిగే ప్రయోజనాలను దెబ్బతీశారని, ఆదరణతో పాటు మరో 30 బీసీ సంక్షేమ పథకాలను రద్దుచేసి బీసీలకు అన్యాయం చేశారని, జగన్ రెడ్డి పాలనలో కబ్జా కు గురైన భూముల్లో అత్యధిక శాతం బీసీలకు చెందిన భూములేనని, అన్యాయాల్ని ప్రశ్నించిన బీసీ నేతలను 300 మందిని హత్య చేయబడ్డారని, జగన్ రెడ్డి తన అవినీతి వ్యవహారాల కోసం బీసీలను కూడా నేరస్తులుగా మార్చారని, జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో ఒక్క బీసీ కి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని, ఇటువంటి వ్యక్తి గతంలో నా బీసీలు, నా ఎస్సీలు నా మైనార్టీలు అని వారిని నిత్యం మోసం చేసిన మోసగాడని నాగ జగదీష్ అన్నారు. 2014- 19 లో బీసీ సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా 40 వేల కోట్లు ఖర్చు చేశారని, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద 2014-19 లో 244 కోట్లు ఖర్చు చేశారని, బీసీలకు నిధులు వినియోగ చట్టాన్ని చట్టబద్ధం చేస్తూ గెజిట్ లో ప్రకటించిన తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని, కూటమి పాలనలో బీసీ సంక్షేమానికి పెద్దపీట వేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీల కోసం వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా 32,534 కోట్లు ఖర్చు పెట్టారని, బీసీలకు కేవలం సంక్షేమం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా సాధికారత కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని , బీసీలను కేవలం ఓటు బ్యాంకు గా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా చూడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం దిశగా ముందుకు వెళుతుందని, ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో జగన్ రెడ్డికి కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేక బీసీలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, వైసిపి మరోసారి బీసీలను మోసం చేయడానికి కుట్రపూరిత ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బీసీల రాజకీయ సాధికారిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, బీసీ రిజర్వేషన్లు 34 శాతం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని అవాంతరాలు ఎదురైన బీసీలకు 34% కోటా విషయంలో సుప్రీంకోర్టు ఆశ్రయించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూటమి ప్రభుత్వం సంకల్పంతో ఉందని, బీసీలకు న్యాయం జరిగే వరకూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ బోడి వెంకటరావు కుప్పిలి జగన్ సాలాపు నాయుడు తదితరులు పాల్గొన్నారు.//

ఇ-పేపర్