వికారాబాద్ పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్, గంజాయి, మద్యం సీజ్.

May 30, 2026 | తెలంగాణ

తప్పిపోయిన బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు..

జనం న్యూస్ 30 మే వికారాబాద్​జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా వికారాబాద్ డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో భారీ ప్రత్యేక తనిఖీలు (Special Drive) నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పట్టణంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో గంజాయి సేవిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని, అతని వద్ద నుండి సుమారు 2 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, ఇందిరానగర్ కాలనీలో కొందరు యువకులు ఒక ఇంటి ముందు గుమిగూడి మద్యం సేవిస్తుండగా గమనించిన పోలీసులు, సదరు ఇల్లాన్ని తనిఖీ చేసి అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 55 బీర్ బాటిల్లు, 43 క్వాటర్ ల మద్యం సీసాలను సీజ్ చేశారు.​శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పలు లాడ్జీలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 15 సంవత్సరాల మైనర్ బాలుడిని పోలీసులు గుర్తించి విచారించగా అతని పేరు శ్రీకాంత్, రుక్మాపూర్, పెద్దేముల్ మండలం నివాసిని అని, అతడు ఇంట్లో నుండి పారిపోయి వచ్చినట్లు తేలింది. డీఎస్పీ అంజయ్య తక్షణమే స్పందించి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, వారిని పిలిపించి బాలుడిని సురక్షితంగా అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే, పాపిలోన్ డివిజన్ బృందంతో కలిసి జరిపిన తనిఖీల్లో హైదరాబాద్ వెళ్ళేందుకు రైల్వే స్టేషన్ వద్ద వేచి ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్ లో వాహనం దొంగతనం చేసిన కేసులోని పాత నేరస్థుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులందరిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అంజయ్య స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో వికారాబాద్ ఎస్హెచ్ఓ (SHO) రఘు కుమార్, క్యూఆర్టీ (QRT) బృందం, వికారాబాద్ క్రైమ్ టీమ్ మరియు బ్లూకోల్ట్స్ (BC) సిబ్బంది, పోలీస్ స్టేషన్ ఇతర సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper