

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటూరు నుండి ఇద్దరు విద్యార్థులు వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపుల పాయలో ఉన్న త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయ్యారు టి. మణిదీప్ S/O నరసయ్య యం. షణ్ముఖ శ్రీనివాస్ S/O యం. బలరాం. ఈ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు కూడా అందుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి లత మరియు ఉపాధ్యాయులు పాటూరు గ్రామ ప్రజలు విద్యార్థులను అభినందించారు.