Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 24)

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తేదీ 17.06.2025 అర్ధరాత్రి అహ్మద్‌నగర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ దొంగతనం చేశారు. ఫిర్యాదుదారు షేక్ బాబా ఫిర్యాదు మేరకు టి. శ్రీరామ్ ప్రేమ్‌దీప్ ఎస్ ఐ దౌల్తాబాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తరువాత 24.06.2025 న అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. అనుమానిత వ్యక్తులను విచారించగా, వారు అహ్మద్‌నగర్‌లో బైక్ దొంగతనం చేసినట్లు, తిమ్మకప్పల్లి గ్రామంలో బ్యాటరీ దొంగతనం చేసినట్లు అంగీకరించారు. తరువాత టి. శ్రీరామ్ ప్రేమ్‌దీప్ ఎస్‌ఐ దౌల్తాబాద్ వారిని జ్యుడీషియల్‌ రిమాండ్కు పంపారు.