Listen to this article

జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.

గత కొన్ని రోజులుగా జైనూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రింద పేర్కొన్న సూచనలు పాటించగలరు: నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదు – నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదకరం మరియు వర్షాలు కురిసే సమయంలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదు.మురుగు కాలువలు, ఓవర్‌ఫ్లో అయిన కుంటలు దాటి వెళ్లవద్దు – గుంతలు, నీటిలో కరెంటు లీకేజ్ ఉన్న అవకాశం ఉంటుంది.విద్యుత్ తీగలు నేలపై పడివున్నచో – వాటిని తాకకుండా వెంటనే స్థానిక విద్యుత్ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.తక్కువ భద్రత ఉన్న ఇళ్లలో నివాసముంటే – తాత్కాలికంగా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లగలరు. పిల్లల్ని నీరు నిండిన ప్రాంతాల్లో ఆడనివ్వవద్దు – ప్రమాదం జరగవచ్చు.వాహనదారులు నెమ్మదిగా నడిపించండి – తడిగా ఉండే రోడ్లపై ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.తరచూ ప్రభుత్వ ప్రకటనలు వినండి – న్యూస్ ఛానెళ్లు, అధికారిక సోషల్ మీడియా ద్వారా తాజా సమాచారం తెలుసుకోవచ్చు. అత్యవసర సహాయానికి వెంటనే సంప్రదించవలసిన నంబర్లు:

    పోలీస్: 100

    అంబులెన్స్: 108

    జైనూర్ పోలీస్ స్టేషన్
    8712670587