Listen to this article

జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కూకట్పల్లి జర్నలిస్టులు మంగళవారం నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, ని ఈరోజు బాలానగర్ లోని పార్టీ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులను అడ్డం పెట్టుకొని వారి పేరు మీద భవన నిర్మాణదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఇలాంటి వారిని నియంత్రించాలని వినతి పత్రంలో జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇలాంటి చర్య కారణంగా అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోనాయకులు నాగిరెడ్డి, పుష్పారెడ్డి ,ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గడ్డమీద బాలరాజు ,దయాసాగర్ ,కరీం,చంద్ర ,వెంకట్, సోమిరెడ్డి మహేష్, శ్యాం తదితరులు పాల్గొన్నారు