

జనం న్యూస్:- కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి 6 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ఏ నరసింహారావు, తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నందివనపర్తి, గ్రామానికి చెందిన జాపాల లక్ష్మయ్య, (70) ఒక తోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 23వ తేదీన రాత్రి తినే సమయానికి అన్నం వడ్డించలేదని భార్యాభర్తల మధ్య చిన్న వివాదం తలెత్తడంతో ఆగ్రహంతో ఇంటి నుండి బయటకు వెళ్లి అదే రోజు గ్రామ శివారులోని చెరువు కట్ట పక్కన ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవరు కూడా అటువైపు వెళ్లకపోవడంతో ఘటన వెలుగులోకి రాలేదు. 6 రోజుల తర్వాత మేకల కాపరి బుధవారం అటువైపు వెళ్లి చూడగా శవాన్ని కుక్కలు ఒక చెయ్యి కాలును పూర్తిగా తిని వేసిన స్థితిలో కనిపించగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దేహాన్ని పోస్టుమార్టం కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.