జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వీరఘట్టం మండలం కంబరవలసకి చెందిన కె.శ్రీధర్ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వేధింపులు భరించలేక తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు శ్రీధర్ తెలిపారు.కుటుంబ కలహాల నేపథ్యంలో స్టేషన్‌కు వెళ్లిన శ్రీధర్‌ను పోలీసులు పలు విధాలుగా హింసకు గురిచేశారని, ఆ అవమానాన్ని భరించలేకే ఇలా చేశాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


