Listen to this article

జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

వీరఘట్టం మండలం కంబరవలసకి చెందిన కె.శ్రీధర్‌ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వేధింపులు భరించలేక తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు శ్రీధర్‌ తెలిపారు.కుటుంబ కలహాల నేపథ్యంలో స్టేషన్‌కు వెళ్లిన శ్రీధర్‌ను పోలీసులు పలు విధాలుగా హింసకు గురిచేశారని, ఆ అవమానాన్ని భరించలేకే ఇలా చేశాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.