పీవీ రమణ తండ్రి వెంకయ్య మృతికి బండి రమేష్ ప్రగాఢ సంతాపం
కుటుంబ సభ్యులను పరామర్శించి భౌతిక కాయానికి నివాళులర్పించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు
జనం న్యూస్, జులై 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్‌బీ 3వ రోడ్డులోని శివాలయం చైర్మన్ పీవీ రమణ తండ్రి వెంకయ్య మృతి పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వెంకయ్య స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న బండి రమేష్ వారి స్వగృహానికి చేరుకుని వెంకయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీవీ రమణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ఆకాంక్షించారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తన సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రముఖులు కూడా వెంకయ్య భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, దినేష్, రాజేష్, అరవింద్, గోపాల్, గంధం రాజు, రంగమోహన్, పనీంద్ర, శ్రీనివాస్ బాబు, ఎల్లేష్ యాదవ్, నరసింహ, శ్రీకాంత్ పటేల్, రవి, రజిత, సుజాత, వాణి తదితరులు పాల్గొన్నారు.