

సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.అబ్దుల్ రహమాన్. (జనం న్యూస్) ఫిబ్రవరి 1.
ఎస్సీ వర్గీకరణ అమలుకై హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న వేల గొంతులు లక్ష డప్పులు మాదిగలభారీ సంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని శనివారం నాడు హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలోవాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ పి జిల్లా కార్యదర్శి గందగళ్ళ ప్రసాద్ మాదిగ హాజరై వారు మాట్లాడుతూ ఈమహా ప్రదర్శన ర్యాలీ ఎల్బీ స్టేడియం నుండి అసెంబ్లీ పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రతి మాదిగ బిడ్డ సంకన డప్పులు వేసుకొని వేల సంఖ్యలో తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రపంచమే మాదిగల వైపు చూసేలా మన డప్పు మన ఆట మన పాట మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలని ప్రపంచ చరిత్రలో మేము మాదిగలము అనే విధంగా మన ప్రదర్శన ఉండాలని అన్నారు. మన ప్రదర్శన ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కనువిప్పు కలిగే విధంగా మాదిగల డప్పులు మారుమోగాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం వేల గొంతుల నినాదం ఏకమవ్వాలని అన్నారు. అప్పుడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు గంధగళ్ళ వీరయ్యమాదిగ. చిలిపిచేడ్ మండల ఇంచార్జ్ ఆశనోల్ల దుర్గ దాస్ మాదిగ. చిలప్ చెడ్ ఎల్లయ్య మాదిగ. నవీన్ మాదిగ. కృష్ణ .నాగేష్ . శంకర్. రవి. తదితరులు పాల్గొన్నారు.