జనం న్యూస్ డిసెంబర్ 01 (అశ్వాపురం ప్రతినిధి:)
అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామపంచాయతీ నా ప్రజలకు న్యాయం జరగాలని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొర్రె ముచ్చు అరుణ్ తేజ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే ! గ్రామపంచాయతీ గతంలో జరిగినటువంటి అవినీతిపై పోరాడి పేద ప్రజలకు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో కొంతమంది పార్టీ కార్యకర్తల తప్పుడు మాటలు విని సమయం వచ్చింది కదా అని ప్రజలకు నోటికి వచ్చిన హామీలు ఇస్తారు. దయచేసి వారు చెప్పిన మాటలు విని మీయొక్క అమూల్యమైన ఓటుని వేసి మన గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ఇంకా వెనక్కు తీసుకు వెళ్ళకండి. గతంలో చేసినటువంటి గ్రామ కంఠం భూమిపై కొంతమంది పార్టీ నాయకులు అలాగే గ్రామ పెద్దలు ఇండ్ల స్థలాలపై కేటాయించుకున్న భూమికి అడ్డుపడ్డ వ్యక్తులను గుర్తించుకోవాల్సిన సమయం వచ్చింది. కావున ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని తగిన బుద్ధి చెప్పాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా జరగబోయే ఎన్నికలలో, గొర్రె ముచ్చు అరుణ్ తేజ అనే నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి గతంలో చేస్తానన్నా, హామీలను నెరవేర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించండి. ఏ మండలాల్లో లేని అభివృద్ధి నా గ్రామంలో నేను చేస్తాను. నేను గతంలో చెప్పిన విధంగా నెల్లిపాక బంజర గ్రామపంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్ కు అంబులెన్స్ మరియు ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ అలాగే గ్రామంలో ఉన్నటువంటి కోతులను పట్టిస్తానని,మరియు ఫంక్షన్ హాల్, అలాగే సోలార్ స్ట్రీట్ లైట్స్, గ్రామపంచాయతీపై 3 లక్షల రూపాయలు నిరుపేద కుటుంబానికి ఫిక్స్డ్ చేస్తానని, ప్రతి ఒక్క నిరుపేద బిడ్డకు శుభకార్యానికై 20 వేల రూపాయలు ఇస్తానని, అలాగే నెల్లిపాక బంజర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు యొక్క సంఖ్య పెంచుతానని, మరియు ఇందిరమ్మ కాలనీ కొరకై స్థలం లేనియెడల వారికి కచ్చితంగా న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో నాతోటి నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ పనులు చేస్తానని ముందుకు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ముందు ఒప్పుకున్నట్లయితే నేను వెనక అడుగు వేయటానికి అయినా సిద్ధమేనని నాకు పదవి ముఖ్యం కాదు? నాగ్రామం అభివృద్ధి కొరకు నేను పోరాడుతున్న కష్టం, నేను ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత నా సొంత ఖర్చులతో అయినా ఈ పనులు చేయటంలో వెనకాడనంటూ ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ విషయాలలో గల్లా పట్టి అడిగే దమ్మున్న వ్యక్తులైతేనే నాకు ఓటెయ్యండి అంటూ ప్రజాముకంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ అమూల్యమైన ఓటును డబ్బుకు మరియు మధ్యానికి అమ్ముడుపోయి గ్రామాన్ని దివాలా తీయకండి. ఓటు వేస్తే మాకు గ్రామ పెద్దలతో పనులు అవుతాయో లేవో అని మీరు చింతించకండి ప్రజలకి అండగా నేను ఉంటాను. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన కోసం ఎన్నో అవకాశాలు ఇచ్చాడు వాటిని వినియోగించుకునేలా మీ ముందు నేను ఉంటాను అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


