ఇంటింట ప్రచార కార్యక్రమంలో మంత్రి సుభాష్ కు అడుగడుగున హారతులు, దీవెనలు
ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి ఆశీస్సులు
జనం న్యూస్ జూలై 29 (ముమ్మిడివరం ప్రతినిధి) ప్రతి కుటుంబానికి సంక్షేమం – అభివృద్ధి భరోసారెండేళ్ల పాలనపై ప్రజల్లో పెరిగిన విశ్వాసంఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి సుభాష్ రామచంద్రపురం:కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రామచంద్రపురం పట్టణంలోని 1, 2,7, 28 వార్డుల్లో మంత్రి సుభాష్ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాల గురించి వివరించారు. ప్రభుత్వ సేవలు, పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను తెలియజేస్తూ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటల పాటు కష్టపడి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమం -అభివృద్ధిని సమన్వయం చేస్తోందని మంత్రి అన్నారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భావితరాల భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అందుకే పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చి నిరుద్యోగ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ యువతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలు, అవసరాలు, సూచనలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ 45 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా చేయడంతో పాటు, ప్రభుత్వం -ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి అతిపెద్ద బలం అని, అదే స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవిల్లి శివ, గరికపాటి సూర్యనారాయణ, దంగేటి గౌరీ శంకర్, కట్టా నాగేశ్వరరావు, మేడిశెట్టి సూర్యనారాయణ, కడియాల రాఘవన్, పదం మూర్తి, నారపురెడ్డి బలరాం, అల్లం శ్రీనివాస్, ఏసుదాసు, దిగుమతి వీరబాబు, వాసంశెట్టి చంద్రశేఖర్, గడి గోవిందు, కుడుపూడి ఫణి తేజ, పొణకల చంటి, గుబ్బల వెంకటరమణ, రెడ్డి సురేష్, ఉర్రెంకల మంగతాయారు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.