

జనం న్యూస్ :7 ఫిబ్రవరి శుక్రవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కవి సామ్రాట్ నోరి నరసింహశాస్తి 126వ జయంతి సందర్బంగా అందజేస్తున్న నోరి సాహిత్య పురస్కారానికి సిద్ధిపేటకు చెందిన కవయిత్రి మంచినీళ్ళ సరస్వతి రామశర్మ ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఇట్టి పురస్కారం ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం రోజున ఉప్పల్, హైదరాబాద్ నందు అందచేస్తారన్నారు. సాహిత్యంతో పాటు ఆధ్యాత్మికంగా కృషి చేస్తున్న మంచినీళ్ల సరస్వతి రామశర్మ నోరి సాహిత్య పురస్కారానికి ఎంపిక కావడం పట్ల సిద్దిపేట లో సాహితీవేత్తలు వేలేటి మృత్యుంజయశర్మ, రుక్మాభట్ల నృసింహశర్మ, చెప్పేల హరినాథ్ శర్మ, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహరావు, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, లింగేశ్వర శర్మ, తాటికొండ శివకుమార్, ఉస్మాన్ అనూరాధ, వీరారెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.