Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026

ప్రజల నమ్మకాన్ని సంపూర్ణంగా గెలుచుకుని భారీ మెజార్టీతో కౌన్సిలర్‌గా ఎన్నికైన సానియా ఖదీర్‌కు వార్డ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార హామీలు ఇచ్చిన ఆమె నిజాయితీ, సేవాభావం ఈ విజయానికి కారణమని స్థానికులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల మద్దతు కూడగట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారని పార్టీ నాయకులు ప్రశంసించారు. విజయం అనంతరం మాట్లాడిన సానియా ఖదీర్ తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డ్ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజల సేవలో ఉంటానని హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, మహిళలు యువతకు ఉపాధి అవకాశాలు వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఈ ఘనవిజయంతో జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.