Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు గుజ్జుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్ రావు హాజరై మాట్లాడారు.. చత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగించాలని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే గుణం కలిగిన వ్యక్తిగా తన సామ్రాజ్యంలో అన్ని మతాలను గౌరవించేవాడని, మహిళలను గౌరవించేవాడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగలగాని లక్ష్మణరావు, ఎడ్ల బాపూరావు, వజీర్ శంకర్రావు, నిరంజన్ మోత్తయ్య మల్లయ్య మహేందర్ శ్రీనివాస్ గోపాల్ రాజు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు….