Listen to this article

సీసీ రోడ్ల నిర్మాణం కొసం ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరు

ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్న విధంగా వ్యవహరిస్తున్న అధికారులు,

  • నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లు

ప్రజాధనం వృధాపై కన్నెర్ల చేస్తున్న ప్రజానీకం

జనం న్యూస్. 5 మార్చి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సిసి రోడ్ల నిర్మాణాల కొరకు ప్రభుత్వం 29 లక్షల రూపాయలు మంజూరు చెయ్యగా సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి, . ప్రభుత్వ నిధులను గండి కొట్టారని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ నాణ్యతలేని నాసిరకం పనులను కొనసాగించారు ప్రజాధనాన్ని వృధా చేశారు రంటూ ప్రజలల్లొ బలంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి, సిసి రొడ్ల నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వహించడంతో ఇదంతా తతాంగం జరుగిదని ప్రజలు ఆరోపించారు నాసిరకమైన ఇసుకలో సిమెంట్ కన్నా డస్ట్ ఎక్కువగా ఉపయోగిచి సీసీ రోడ్లపై వేసిన మూడు రోజులకే పగుళ్లు ఏర్పడయని ప్రజల ఆరోపిచారు , సీసీ రోడ్లు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక గ్రామస్తులు మండి పడుతున్నారు.