

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ జనం న్యూస్ మార్చి 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ స్థానిక ప్రాథమిక పాఠశాల చిట్కుల్ యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారిగా లోకేష్, మండల విద్యాధికారిగా ముఖేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ప్రేమ పూర్ణ, ఉపాధ్యాయులుగా నవదీప్, లోహిత్, దీక్షిత, సింధు, హరీష్ తదితర విద్యార్థులు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామచంద్రారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు నాగేందర్ రెడ్డి, సత్యనారాయణ మరియు అనిత పర్యవేక్షించారు