Listen to this article

మార్చి 5 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటినుండి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగాఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా విద్యార్థులకు ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. గోపాల్ రావు ఆదేశాల మేరకు వాజేడు జూనియర్ కాలేజీ వద్ద హెల్త్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్,విజయ్ కుమార్ వాజేడు ఎస్ఐ రాజ్ కుమార్ వారి సిబ్బంది మరియు వైద్య సిబ్బంది. ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.