

జనం న్యూస్ 05 మార్చి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోలు గ్రామంలో పల్లె ప్రకృతి లో భాగంగా నర్సరీ మొదలు పెట్టడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రకృతి కొరకై 8,000 వేల నీలగిరి చెట్లను పెంచడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండు వెంకటేష్ మాట్లాడుతూ చెట్ల వలన గాలి మరియు నీడ చక్కటి వాతావరణం మానవునికి బ్రతకడానికి గాలి ఈ చెట్ల వలన అనేక రకమైన లాభాలు ఉన్నాయి కనుక చెట్లను పెంచడం మన అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏం నర్సింలు ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.