

చండూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఎత్తిపోతల పథకం లిఫ్టు జనం న్యూస్ మార్చ్ 5 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి స్థానిక ఎమ్మెల్యే నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కి వినతిపత్రం అందజేయడం జరిగింది చండూరు మరియు గుజిరి తాండ గ్రామ రైతులు చండూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఎత్తిపోతల పథకం వివిధ కారణాలవల్ల మరియు మట్టి నిండి మోటర్లు పంపుసెట్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడం జరిగింది ఆయకట్టు మొత్తం 800 ఎకరాలు సాగు లిఫ్టు ఇరిగేషన్ భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు పోయలేక బోర్లు వేసిన రైతులు అప్పులపాలై సాగు చేయలేకపోతున్నారు మీరు దయ తలచి అధికారులను ఆదేశించి మోటర్లు పంపుసెట్లు ట్రాన్స్ఫార్మర్త్తులు చేయించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గుజిరి తాండ మరియు చండూరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు అలాగే 500 మీటర్లు పొడవు లైను పొడిగించి దానికి సంబంధించిన నిధులను విడుదల చేయించాలి ఈ కార్యక్రమంలో చండూరు గ్రామానికి చెందిన దాసరి శేషాద్రి తలారి నర్సింలు మరియు చింతల కింద విష్ణు గుజిరి తాండకు చెందిన రాకేష్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు