

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల < జనం న్యూస్ మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు )త్పవటపల్లి నాగేంద్ర, త్పవటపల్లి శ్రీను (చెమ్యేరు) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయానికి కృషిచేసిన పట్టభద్రులకు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రులు ఏ ఆకాంక్షల కోసమైతే కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించారో వాటి సాధనకు ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు యువత సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు అనటానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజేంద్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల స్థానం నుండి పేరాబత్తుల రాజశేఖరంలు తొలి ప్రాధాన్యత ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందటమే నిదర్శనమని దాట్ల బుచ్చిబాబు అన్నారు.