

జనం న్యూస్ 05మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతీనిధి కురిమెల్ల శంకర్ ) జిల్లా అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే.. సమగ్ర అ భివృద్ధి మీ బాధ్యత అని టీఎన్జీవోస్ నాయకులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టర్ చేతుల మీదుగా ఆ సంఘ నూతన డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, జిల్లా సమ్మిళితాభివృద్ధిని కొనసాగించేలా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలని, జిల్లా అభ్యున్నతికి సలహాలు సూచనలు ఇవ్వాలని టీఎన్జీవోస్ నాయకులను కోరారు. ప్రధానంగా రైతులకు సాంకేతికతను అవలంబించడంపై మెరుగైన అవగాహన కల్పించడానికి విజ్ఞాన ప్రదర్శనలను నిర్వహించాలని, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టడానికి మరియు విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు. టీఎన్జీవో సంఘం తరఫున వ్యవసాయ రంగం బలోపేతం కోసం అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో టీ న్ జి ఓ జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు, కార్యదర్శి సాయి భార్గవ్ చైతన్య మరియు జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు.