Listen to this article

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపిన మహిళా నాయకురాలు -జానకి రెడ్డి

జనం న్యూస్- ఫిబ్రవరి 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపుమేరకు నాగార్జునసాగర్ లోని ఉద్యమకారులు పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా రాష్ట్ర మహిళా నాయకురాలు జానకి రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి పంపడం జరిగింది, మహిళా నాయకురాలు జానకి రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని, 25 వేల రూపాయల పెన్షన్, హెల్త్ కార్డును, గుర్తింపు కార్డును ఉచిత బస్సు పాసులను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో నందికొండ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ హీరేకర్ రమేష్ జి, సపావత్ చంద్రమౌళి, సల్లోజు శేఖరా చారి, పందిర్ల సత్యనారాయణ స్వామి, లక్ష్మణ్ నాయక్, గుజ్జుల కొండలు తదితరులు పాల్గొన్నారు.