Listen to this article

ఘనంగా సన్మానించినా పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ… జనం న్యూస్ // మార్చ్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. వరుసగా క్రీడా పోటీలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో అత్యంత ప్రతిభను కనబరిచి పథకాలు సాధిస్తూ ఇటీవల హైదరాబాదులో జరిగిన తెలంగాణ మాష్టర్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడా పోటీలలో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్,,ప్రభు, జావలిన్ త్రో ఈవెంట్లో అత్యంత ప్రతిభను కనబరిచి హిమాచల్ ప్రదేశ్ లో జరిగే జాతీయ స్థాయి మాస్టర్ గేమ్స్ పోటీలకు ఎంపిక అయ్యారు. గత సంవత్సరం జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో 45+ విభాగంలో హేమర్ త్రో లో ద్వితీయ స్థానంతో వెండి పత్రం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంతో తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అవార్డును సుప్రీంకోర్టు న్యాయవాది గీతా చౌదరి, తెలంగాణ మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై రామారావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ, ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అవార్డు అందుకున్న ప్రభును షాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ (ఎమ్మెస్ పి) రాష్ట్ర నాయకులు ఇంజం వెంకటస్వామి, వాగ్గేయకారులు మచ్చ దేవేందర్, మందకృష్ణ మాదిగ ప్రధాన అనుచరులు దూడపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.