

వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్ మార్చి 5 జనంన్యూస్వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బుధవారం ఉదయం చొక్కాల గ్రామ సమీపంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్, మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు అక్రమంగా పశువులు తరలిస్తున్న 4 బొలెరో వాహనాలను సీజ్ చేయడం జరిగింది.ఈ వాహనాలు నిందితుల కథనం ప్రకారం చర్ల నుండి హైదరాబాద్ కి తరలిస్తున్నట్లు గా తెలిసింది.
తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేసి అందులో తరలిస్తున్న 42 పశువులను గోశాల కు తరలించడం జరిగింది. వివరాల్లోకి వెళితే నిందితులు 1) మోహమ్మద్ షఫీ మదీనా వీధి, కాశీబుగ్గ, వరంగల్ జిల్లా. 2) ఉప్పు రాజేందర్ s /o వెంకన్న, డ్రైవర్ , R/o జంగాలపల్లి (గామం, ములుగు మండలం. 3) ఉప్పు సంపత్,డ్రైవర్ , R/o గాలపల్లి (గామం, ములుగు మండలం. 4) సుగాలి రాజేందర్,వృత్తి: కూలీ/హెల్పర్, R/o జంగాలపల్లి (గామం, ములుగు మండలం. 5) మోహమ్మద్ సమీర్,డ్రైవర్ , R/o మల్లంపల్లి గ్రామం , ములుగు జిల్లా. 6) మోహమ్మద్ జాఫర్, నీరుకుళ్ళ గ్రామం , ఆత్మకూరు మండలం, వరంగల్ జిల్లా. 7) మోహమ్మద్ యాసిన్ డ్రైవర్ , R/ మల్లంపల్లి గ్రామం , ములుగు మండలం. 8)కనకం మహేష్ కులం మాదిగ వృత్తి: కూలీ/హెల్పర్, R/o జంగాలపల్లి గ్రామం , ములుగు మండలం. ఎవరైనా పశువులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటాపురం,HC రాజమౌళి,ఎఎస్ఐ రామచంద్రు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు